Shiva kumar: డీకే సీఎం కావాల్సిందే.. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |

కర్ణాటకలో సీఎం మార్పుపై ఉత్కంఠ నెలకొన్న వేళ మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు.

Shiva kumar: డీకే సీఎం కావాల్సిందే.. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో సీఎం మార్పుపై ఉత్కంఠ నెలకొన్న వేళ మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే యోగేశ్వర్ (Yogeshwar) కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ (Dk shiva kumar) ముఖ్యమంత్రి కావాల్సిందేనని, ఆయనకు పార్టీలోని అనేక మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ప్రజలు సైతం ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారని, ఆ అభిప్రాయంతో విభేదించలేదని స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్‌కే వదిలేసినట్టు వెల్లడించారు. కాగా,100 మందికి పైగా ఎమ్మెల్యేలు శివకుమార్‌కు మద్దతు ఇస్తారని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యోగేశ్వర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Next Story