నాకే ఇలాంటి ఫుడ్ పెడితే.. మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి ?: ఎమ్మెల్యే ఫైర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-12 16:12:31  IST  )

తనకు పెట్టిన ఆహారం బాలేకపోవడంతో.. క్యాంటీన్ సిబ్బందితో ఎమ్మెల్యే గొడవపడిన ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది.

నాకే ఇలాంటి ఫుడ్ పెడితే.. మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి ?: ఎమ్మెల్యే ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తనకు పెట్టిన ఆహారం బాలేకపోవడంతో.. క్యాంటీన్ సిబ్బందితో ఎమ్మెల్యే గొడవపడిన ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ (Sanjay Gaikwad) గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు తనకు పెట్టిన ఆహారంలో పప్పు వాసన వస్తోందని ఫైరయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ముంబైలోని ప్రభుత్వ ఆకాశవాణి గెస్ట్ హౌస్ లోనే బుల్దానా నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఉంటున్నారు.

ఆయన ఫుడ్ ఆర్డర్ ఇవ్వగా.. క్యాంటీన్ నుంచి పంపిన ఆహారంలో పప్పు వాసన రావడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. టవల్ తోనే క్యాంటీన్ కు వెళ్లి ఎవరు వండారని ప్రశ్నించారు. ఆ ప్యాకెట్ ను ఓపెన్ చేసి వాసన చూడాలని అక్కడున్నవారందరికీ చూపించారు. ఆ పప్పును తిన్న తర్వాత తనకు కడుపులో నొప్పి, అసౌకర్యంగా అనిపించిందని వాపోయారు. తనకే ఇలాంటి నాసిరకం ఫుడ్ పెడితే.. ఇక వేలాదిమంది సామాన్యులకు ఎలాంటి ఆహారం పెడుతున్నారోనని తిట్లదండకం అందుకున్నారు. ఫుడ్ డిపార్ట్మెంట్ కు కంప్లైంటి చేస్తానని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. క్యాంటీన్ ఆపరేటర్ పై చేయి చేసుకోవడంతో అతను కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రియాక్షన్ కరెక్టేనని కొందరు, ఇది శివసేన స్టైల్ అని చెప్పడం సబబు కాదని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Next Story