- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shiv Sena MLA: క్యాంటీన్ సిబ్బందిపై దాడి వ్యవహారంలో శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌పై కేసు నమోదు
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. దీనిపై విచారణ జరుపుతామని, పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని అన్నారు

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తనకు కుళ్లిన ఆహారం వడ్డించాడని ఆరోపిస్తూ సిబ్బందిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్ సిబ్బందిపై దాడి కేసులో ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌పై నేరం నమోదు చేసినట్లు ముంబై పోలీసులు శుక్రవారం తెలిపారు. ముంబై చర్చిగేట్‌లోని ఎమ్మెల్యేల క్యాంటీన్‌లో తనకు వడ్డించిన ఆహారం రుచిగా లేదని, కుళ్లిపోయిందంటూ ఆరోపిస్తూ క్యాంటిన్ సిబ్బంది, మేనేజర్, ఇతరులపై ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ భౌతికంగా దాడికి దిగారు. వారిపై పిడిగుద్దులు గుద్దుతూ రభస చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో, సదరు ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ, విధాన సభలో ఈ అంశం గురించి ప్రతిపక్షాలు, శివసేన (ఉద్ధవ్) వర్గం చర్చకు లేవనెత్తాయి. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. దీనిపై విచారణ జరుపుతామని, పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని అన్నారు. అయితే, ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌కు వివాదాలు కొత్త కాదు. గతంలో 2024లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నాలుకను నరికివేసేవారికి రూ. 11 లక్షల బహుమతిని ప్రకటించి పెద్ద దుమారమే రేపాడు. 2024, ఫిబ్రవరిలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తాను 1987లో ఓ పులిని వేటాడి తన మెడలో దాని పంటిని ధరించానని అన్నాడు. ఈ ప్రసంగం తర్వాత అతనిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద అభియోగాలు మోపారు.






