భూకేటాయింపుల స్కాంలో షేక్ హసీనాకు ఐదేళ్ల జైలు.!

by Phanindra |

భూకేటాయింపుల స్కాంలో షేక్ హసీనాకు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. ఢాకాలోని ప్రత్యేక కోర్టు ఈ తీర్పునిచ్చింది.

భూకేటాయింపుల స్కాంలో షేక్ హసీనాకు ఐదేళ్ల జైలు.!
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆవామీ లీగ్ చీఫ్ షేక్ హసీనాకు బంగ్లాదేశ్‌ జైలుశిక్ష పడింది. ఇటీవలే గతేడాది జరిగిన హింసాత్మక విద్యార్థి నిరసనల అంశంలో ఢాకాలోని ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఒక భూ కేటాయింపుల కుంభకోణంలో ఆమెకు ఐదేళ్ల జైలుశిక్ష వేస్తున్నట్లు ఢాకాలోని మరో ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఇదే కేసులో షేక్ హసీనా సోదరి, షేక్ రెహానాకు కూడా ఏడేళ్లు, హసీనా మేనకోడలైన బ్రిటన్ ఎంపీ తులిప్ సిద్దిఖ్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తున్నట్లు జడ్జి రబియుల్ ఆలమ్ తీర్పిచ్చారు. పూర్బాంచల్ న్యూ టౌన్ ప్రాజెక్టు కోసం భూములు కేటాయించిన అంశంలో అక్రమాలు జరిగాయంటూ యాంటీ కరప్షన్ కమిటీ (ఏసీసీ).. హసీనా, ఆమె కుటుంబంపై మొత్తం ఆరు కేసులు వేసింది. వీటిలో మూడింటిలో హసీనాతోపాటు మరికొందరిని దోషులుగా నిర్ధారించిన కోర్టు వారికి జైలుశిక్షలు విధించింది. ఇప్పుడు తాజాగా మరో కేసులో దోషిగా నిర్ధారణ అవడంతో హసీనాకు ఇంకో ఐదేళ్ల జైలుశిక్ష విధించడం గమనార్హం.

కేసు ఏమిటంటే?

పూర్బాంచల్ ప్రాజెక్టులో డిప్లొమాటిక్ జోన్‌లో 7,200 చదరపు అడుగులుండే పది ప్లాట్లను హసీనా తన కుటుంబం కోసం అక్రమంగా ఆర్జించారని ఏసీసీ ఆరోపించింది. ఈ ఏడాది జులై 31న హసీనా, ఆమె కుటుంబ సభ్యులు సహా 29 మీద ఈ భూకేటాయింపుల కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై విచారణ జరిపిన కోర్టు.. ఒక్కో కేసులో ఏడేళ్ల కఠిన కాగారాశిక్ష లెక్కన మూడు కేసులకు కలిపి, హసీనాకు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఒక్కో కేసులో దోషులుగా తేలిన జాయ్, పుతుల్‌కు చెరో ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. తాజాగా నాలుగో కేసులో హసీనా దోషిగా తేలడంతో అదనంగా మరో ఐదేళ్లు జైలుశిక్ష విధించడం గమనార్హం.

Next Story