- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shaurya Chakra: శౌర్య పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము
విధి నిర్వహణలో దైర్య సాహసాలు చూపిన సాయుధ దళాలు, పోలీసులకు చెందిన సిబ్బందికి అందజేసే శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: విధి నిర్వహణలో దైర్య సాహసాలు చూపిన సాయుధ దళాలు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులకు చెందిన సిబ్బందికి అందజేసే శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadhi murmur) గురువారం ప్రదానం చేశారు. వీటిలో 6 కీర్తి చక్ర (Keerthi chakra), 33 శౌర్య చక్ర (Shaurya chakra) అవార్డులు ఉన్నాయి. మరణానంతరం నలుగురికి కీర్తి చక్ర, ఏడుగురికి శౌర్య చక్ర ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతల్లో ఇండియన్ ఆర్మీ, సీఆర్ పీఎఫ్, ఎయిర్ పోర్స్, జమ్మూ కశ్మీర్ పోలీసులకు చెందిన భద్రతా సిబ్బంది ఉన్నారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ (Modi), ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, కీర్తి చక్ర దేశంలో రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం.






