Shashi Tharoor: నేను ప్రభుత్వం కోసం పనిచేయట్లేదు.. ప్రతిపక్ష పార్టీలో ఉన్నా- శశిథరూర్

by Shamantha N |

ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న అతి పెద్ద సమస్య.. దీనిపై మనం ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచదేశాలకు తెలిపేందుకు భారత దౌత్య బృందం విదేశాల్లో పర్యటిస్తుంది.

Shashi Tharoor: నేను ప్రభుత్వం కోసం పనిచేయట్లేదు.. ప్రతిపక్ష పార్టీలో ఉన్నా- శశిథరూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న అతి పెద్ద సమస్య.. దీనిపై మనం ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచదేశాలకు తెలిపేందుకు భారత దౌత్య బృందం విదేశాల్లో పర్యటిస్తుంది. కాగా.. శశిథరూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. ఈక్రమంలోనే న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్‌ను బృందం సందర్శించింది. ఈ సందర్భంగా శశిథరూర్‌ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ తీసుకొన్న చర్యలను ఆయన తెలిపారు. శశిథరూర్ మాట్లాడుతూ.. ‘‘పహెల్గాంలో మతం ఆధారంగా పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడితో భారత్‌లో మతపరమైన అల్లర్లు సృష్టించాలనేది వారి ప్రయత్నంగా తెలుస్తోంది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. అది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ. దీన్ని ఉగ్రసంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భారత్ ఇప్పటికే కోరింది.” అని అన్నారు.

ప్రభుత్వం కోసం పనిచేయట్లేదు..

తాను ప్రభుత్వం కోసం పనిచేయట్లేదని శశిథరూర్ చెప్పుకొచ్చారు. “నేను ప్రభుత్వం కోసం పనిచేయట్లేదు. ప్రభుత్వంలో కాకుండా.. ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను. ఈ దాడి తర్వాత పాక్‌పై తీసుకోవాల్సిన అంశాలను ఉద్దేశిస్తూ నేను ఒక వ్యాసం రాశాను. సరిగ్గ రెండ్రోజుల తర్వాత భారత బలగాలు పాక్‌ను బలంగా, తెలివితో దెబ్బతీశాయి. పాక్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత బలగాలు కచ్చితమైన దాడులు చేసి.. వాటిని ధ్వంసం చేశాయి. మేం ఉగ్రస్థావరాలపై దాడి చేస్తే.. పాక్‌ సైన్యం స్పందించింది. మాపై ప్రతిదాడులకు దిగింది. వాటిని సమర్థమంతంగా తిప్పికొట్టాం. ఈ ఆపరేషన్‌తో ఉగ్రచర్యలను భారత్ సహించదనే గట్టి సందేశం ఇచ్చింది. ఇది పహెల్గాం దాడికి ప్రతిస్పందన మాత్రమే తప్ప.. పాక్‌తో యుద్ధం చేయాలనేది మా ఉద్దేశం కాదు. దాన్ని మేము కోరుకోవడం లేదు. దేశ ప్రజల రక్షణే మాకు ముఖ్యం’’ అని శశిథరూర్‌ పేర్కొన్నారు.

Next Story