Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు షాక్.. పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు సమన్లు

by B.Srinivas |

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు షాక్ తగిలింది. బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు సమన్లు ​​జారీ చేసింది.

Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు షాక్.. పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) కు షాక్ తగిలింది. బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandra Shekhar) దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు (Delhi high court) ఆయనకు సోమవారం సమన్లు ​​జారీ చేసింది. జస్టిస్ పురుషిందర్ కుమార్ కౌరవ్‌తో కూడిన ధర్మాసనం ఈ నోటీసులు పంపింది. చంద్రశేఖర్‌పై చేసిన పరువు నష్టం అభియోగాలపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్ 28లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని తెలిపింది. ఫిర్యాదును అధికారిక దావాగా పరిగణించాలని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో కేరళలోని తిరువనంతపురం ఓటర్లకు చంద్రశేఖర్ డబ్బులు ఇచ్చారని శశథరూర్ ఆరోపించారు. దీంతో థరూర్ చేసిన తప్పుడు ప్రచారం తన ప్రతిష్టను దెబ్బ తీసిందని అంతేగాక తన ఓటమిలో కీలక పాత్ర పోషించాయని చంద్రశేఖర్ పరువు నష్టం దావా వేశారు. శశిథరూర్ తనకు క్షమాపణలు చెప్పడంతో పాటు రూ.10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం సమన్లు జారీ చేసింది.

Next Story