Shashi Tharoor: ప్రధాని మోడీ భారత దేశ ఆస్తి.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

by B.Srinivas |   (  Updated:2025-06-23 14:39:38  IST  )

ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రశంసలు కురిపించారు.

Shashi Tharoor: ప్రధాని మోడీ భారత దేశ ఆస్తి.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) మరోసారి ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ భారత్‌కు ప్రధాన ఆస్తి అని అభివర్ణించారు. ఈ మేరకు ఓ వార్త పత్రికలో వ్యాసం రాశారు. ‘మోడీ శక్తి, చైతన్యం ప్రపంచ స్థాయిలో కమ్యూనికేట్ చేయడానికి భారతదేశానికి గొప్ప బలం. దీనికి మరింత మద్దతు అవసరం. ఎందుకంటే భారత్ ఐక్యంగా ఉన్నప్పుడు అంతర్జాతీయ వేదికలపై స్పష్టత, దృఢ నిశ్చయంతో తన స్వరాన్ని వినిపించగలదు’ అని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం చేపట్టిన దౌత్య ప్రచార కార్యక్రమం ప్రపంచ వేదికపై భారతదేశ ఐక్యతను చాటిచెప్పిందని కొనియాడారు.

పెరుగుతున్న సంక్లిష్టమైన అంతర్జాతీయ ప్రకృతి దృశ్యాన్ని నావిగేట్ చేయడంలో ఐక్యత, స్పష్టమైన కమ్యూనికేషన్, స్థిరమైన దౌత్యం విలువను ఈ ప్రచారం నొక్కిచెప్పిందని పేర్కొన్నారు. భారతదేశ భవిష్యత్ ప్రపంచ వ్యూహాన్ని నడిపించడంలో మూడు టిలు టెక్నాలజీ, ట్రేడ్, ట్రెడిషన్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. కాగా, ఆపరేషన్ సిందూర్ పై కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలకు విరుద్ధంగా శశిథరూర్ కామెంట్స్ ఉండటం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్ నేత మోడీని బహిరంగంగా ప్రశంసించడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story