- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shashi Tharoor: ఎంపీ శశిథరూర్‌పై దాడికి యత్నం.. గన్‌మెన్‌కు గాయాలు, ఐదుగురిపై కేసు నమోదు
కేరళలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ కేరళ (Kerala)లో రాజకీయం మరింత వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ (Shashi Tharoor) ప్రచార కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో థరూర్ వ్యక్తిగత గన్‌మెన్, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి శశి థరూర్ కాంగ్రెస్ నేత ఏపీ అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారానికి హాజరయ్యేందుకు వండూర్ మీదుగా వెళ్తున్నారు. చెల్లితోడ్ వంతెన సమీపంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే థరూర్ కాన్వాయ్ ముందున్న రెండు వాహనాలు దారి ఇవ్వకుండా అడ్డుకున్నాయి. దారి ఇవ్వాలని కోరినందుకు ఆ వాహనాల్లో ఉన్న వ్యక్తులు థరూర్ గన్‌మెన్, డ్రైవర్‌పై ఒక్కసారిగా దాడికి దిగారు.
దాడి చేయడమే కాకుండా, ఎంపీని, ఆయన సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించినట్లుగా ఐఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్నారు. ఈ హఠాత్పరిణామంతో కాన్వాయ్‌లో కొంతసేపు గందరగోళం నెలకొంది. అయితే శశి థరూర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. థరూర్ డ్రైవర్ రతీష్ కేపీ (Ratheesh KP) ఫిర్యాదు మేరకు వండూర్ (Vandoor) పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులు ప్రయాణించిన రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల సమయంలో ఒక సీనియర్ ఎంపీపై ఇలాంటి దాడులు జరగడం కేరళలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించింది.






