Sharif : అణు దాడి చేసే ఉద్దేశం లేదు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

by B.Srinivas |

ఆపరేషన్ సిందూర్ టైంలో భారత్ పాకిస్థాన్‌ల మధ్య అణు ర్షణకు దారితీయొచ్చనే ఆందోళనను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తోసిపుచ్చారు.

Sharif : అణు దాడి చేసే ఉద్దేశం లేదు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై అణ్వాయుధాలతో దాడి చేస్తామని బెదిరించిన పాకిస్థాన్ మాట మార్చింది. ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) టైంలో భారత్ పాకిస్థాన్‌ల మధ్య అణు ఘర్షణకు దారితీయొచ్చనే ఆందోళనను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shahabaz sharif) తోసిపుచ్చారు. పాక్ అణు కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాలు, ఆత్మరక్షణ కోసమేనని స్పష్టం చేశారు. ఇస్లామాబాద్‌లో విద్యా్ర్థులతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఇతర దేశాలపై దాడి చేసే ఉద్దేశం లేదని తెలిపారు. అవి కేవలం దేశ రక్షణకు మాత్రమేనన్నారు. భారత్ తో జరిగిన సైనిక ఘర్షణలో 50 మంది పాక్ పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పాకిస్తాన్ తన సైనిక బలాన్ని ప్రదర్శించి పూర్తి శక్తితో ప్రతీకారం తీర్చుకుందన్నారు.

కాగా, ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహెల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మృతి చెందడంతో మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. ఈ దాడిలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో పాకిస్థాన్‌కు నష్టం వాటిల్లింది.

Next Story