Sharif: శాంతిని చెడగొట్టేందుకే భారత్ ప్రయత్నం.. పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్

by B.Srinivas |

పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ మరోసారి భారత్‌పై విషం కక్కారు. పహెల్గాం ఉగ్రదాడి ఒక దురదృష్టకర చర్య అని అన్నారు.

Sharif: శాంతిని చెడగొట్టేందుకే భారత్ ప్రయత్నం.. పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehabaz shareef) మరోసారి భారత్‌పై విషం కక్కారు. పహెల్గాం ఉగ్రదాడి ఒక దురదృష్టకర చర్య అని, దీనిని అడ్డుపెట్టుకుని భారత్ శాంతిని చెడగొట్టిందని ఆరోపించారు. ప్రాంతీయంగా పరిస్థితులను అస్థిరపర్చేందుకు టెర్రిరిస్ట్ అటాక్‌ను భారత్ ఉపయోగించుకుందని తెలిపారు. అజర్‌బైజాన్‌లో జరిగిన ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ECO) శిఖరాగ్ర సమావేశంలో షరీఫ్ ప్రసంగించారు. ‘జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి ఒక దురదృష్టకర సంఘటన. కానీ దీని ద్వారా భారత్ ప్రాంతీయ శాంతిని అస్థిర పర్చేందుకు ప్రయత్నించింది’ అని వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌లో పౌరులపై జరిగిన దాడులు అనాగరిక చర్య అని అభివర్ణించారు. గాజా, ఇరాన్‌లలోనూ ప్రజలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా పాక్, అజర్‌బైజాన్ మధ్య రెండు బిలియన్ల పెట్టుబడి ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాలు సంతకం చేశాయి. ఆపరేషన్ సిందూర్ టైంలో పాక్‌కు అజర్ బైజాన్ మద్దతిచ్చింది. కాగా, జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

Next Story