- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కేసు.. హైకోర్టును ఆశ్రయించిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద
జ్యోతిర్‌మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి, ఆయన శిష్యుడు ముకుందానంద గిరి మంగళవారం అలహాబాద్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో జ్యోతిర్‌మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి, ఆయన శిష్యుడు ముకుందానంద గిరి మంగళవారం అలహాబాద్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ కేసు పూర్తిగా కల్పితమని, తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని స్వామి ఖండించారు. పోక్సో (POCSO) ప్రత్యేక కోర్టు ఆదేశాలతో ప్రయాగ్‌రాజ్‌లోని ఝూన్సీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఆ పిల్లలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్వామి లేదన్నారు.
గత ఏడాది కాలంగా గురుసేవ పేరుతో..
తులసి పీఠాధీశ్వర్ స్వామి రామభద్రాచార్య శిష్యుడు అశుతోష్ బ్రహ్మచారితో పాటు మరికొందరు ప్రయాగరాజ్ జిల్లా కోర్టులో సెక్షన్ 173(4) కింద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. పోక్సో ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఝాన్సీ పోలీసులు పోక్సో (Protection of Children from Sexual Offences) చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. గత ఏడాది కాలంగా గురుసేవ పేరుతో గురుకులంలోనూ, ఇటీవల ముగిసిన మాఘమేళాలోనూ ఓ మైనర్ బాలుడితో పాటు మరో యువకుడిపై స్వామి, ఆయన శిష్యుడు, మరో ముగ్గురు వ్యక్తులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదుదారులు ఆరోపించారు.
పిల్లలతో సంబంధం లేదు..
ఈ సందర్భంగా వారణాసిలోని విద్యా మఠం వద్ద స్వామి అవిముక్తేశ్వరానంద విలేకరులతో మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా కల్పిత కేసు అని, మాకు పోలీసుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని, పోలీసులు వస్తే వారితో మాట్లాడతామని అన్నారు. ‘అసలు ఆ పిల్లలతో మాకు సంబంధం ఏంటి? వారు ఎన్నడూ మా దృష్టికి రాలేదు, మా సంస్థలో చేరలేదు. కావాలంటే వారిపై వేలాది వైద్య పరీక్షలు నిర్వహించుకోవచ్చు.. వారితో మాకు సంబంధం ఉందని నిరూపించాల్సిన బాధ్యత ఆరోపణలు చేసిన వారిదే’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎఫ్ఐఆర్‌పై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ స్వామి ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.






