- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shankaracharya: నిర్వహణ లోపం కాకపోతే మరేంటి?.. మమతా వ్యాఖ్యలకు శంకరాచార్య మద్దతు
యూపీలోని ప్రయాగ్ రాజ్ నగరంలో జరుగుతున్న మహాకుంభమేళాను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మృత్యుకుంభ్‌గా అభివర్ణించిన విషయం తెలిపిందే.

దిశ, నేషనల్ బ్యూరో: యూపీలోని ప్రయాగ్ రాజ్ నగరంలో జరుగుతున్న మహాకుంభమేళాను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamatha benarjee) మృత్యుకుంభ్‌గా అభివర్ణించిన విషయం తెలిపిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడగా ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి మహారాజ్ మాత్రం మమతా బెనర్జికి మద్దతిచ్చారు. జాతర సందర్భంగా 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, ఇది నిర్వహణ లోపం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. ప్రజలు తమ సామానుతో 25-30 కి.మీ నడవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్నానానికి వచ్చే నీరు మురుగునీటితో కలిసి ఉంటుంది. శాస్త్రవేత్తలు దానిని స్నానం చేయడానికి తగినదిగా పరిగణించడం లేదు. అయినప్పటికీ కోట్లాది మందిని అందులో స్నానం చేయాలని బలవంతం చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు’ అని వ్యాఖ్యానించారు.
మహా కుంభ్ నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కొన్ని రోజులు కాలువలను మూసివేసి ప్రజలు స్నానం చేసేటప్పుడు స్వచ్ఛమైన నీటిని పొందేలా వాటిని మళ్లించడం ఎందుకు చేయలేదని ఫైర్ అయ్యారు. 12 సంవత్సరాల తర్వాత కుంభమేళా వస్తుందని 12 ఏళ్ల క్రితమే తెలుసు అయినా నిర్వహణలోపం ఎందుకు జరగిందని తెలిపారు. కుంభమేళా కోసం ముందస్తు ప్రణాళికలు రచించలేదన్నారు. అంతేగాక ప్రజలు చనిపోయినప్పుడు, వారు దానిని దాచడానికి ప్రయత్నించారని అది తీవ్రమైన నేరమని అభివర్ణించారు.






