- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోటాపోటి నిరసనలు.. SFI, AIDSO, TMC విద్యార్థి విభాగాల పరస్పర దాడి
SFI, AIDSO, TMC student wing mutual attack in Calcutta

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిపై SFI నాయకులు దాడి చేసి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి నిరసనగా టీఎమ్‌సీ(TMC)తో పాటు ఆ పార్టీ అనుబంధ సంస్థలు ఎస్ఎఫ్ఐ కు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చారు. దీనికి వ్యతిరేకంగా.. పశ్చిమ బెంగాల్‌లోని అన్ని విశ్వవిద్యాలయాలలో SFI విద్యార్థుల సమ్మె పిలుపునిచ్చింది. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని యూనివర్శిటీల్లో సోమవారం విద్యార్థి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) పిలుపునిచ్చిన విద్యార్థుల సమ్మె సందర్భంగా తృణమూల్ ఛత్ర పరిషత్ (టిఎంసి పి), ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎఐడిఎస్‌ఓ) సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది.
జాదవ్‌పూర్‌లో విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు తన కాన్వాయ్‌పై ఇద్దరు విద్యార్థులు గాయపడిన సంగతి తెలసిందే. తాజా నిరసనలతో కోల్‌కతాలోని జాదవ్‌పూర్, ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయాలు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రోజంతా సమ్మెను అమలు చేయడానికి SFI సభ్యులు సమావేశమయ్యారు. కలకత్తా విశ్వవిద్యాలయం, రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం, నార్త్ బెంగాల్ విశ్వవిద్యాలయం మరియు బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం వంటి ఇతర సంస్థలు కొన్ని తరగతులు రద్దు చేయడంతో పాక్షికంగా ప్రభావితమయ్యాయి.
అయినప్పటికీ సెమిస్టర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం కొనసాగాయి. అయితే నిరసనల్లో భాగంగా విద్యార్థి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIDSU) నేతలు బస్సులతో పాటు ఇతర వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్ బోర్డు 12వ తరగతి పరీక్షలను రాసే విద్యార్థులు ప్రభావితం అయ్యారని ఆరోపిస్తూ.. టీఎంసీ విద్యార్థి విభాగం నేతలు SFI, AIDSU నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు.






