- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుడిపై లైంగిక దాడి.. వీడియో తీసి మరి..
యువకుడిపై లైంగిక దాడి చేసి వీడియో తీసి బెదిరించిన ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మణప్పారైలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: యువకుడిపై లైంగిక దాడి చేసి వీడియో తీసి బెదిరించిన ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మణప్పారైలో చోటు చేసుకుంది. మణప్పారైకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి(27) పుత్తానందం నుంచి మణుప్పారైకు బస్సులో వెళ్తున్నారు. వండిపేట్టైకు చెందిన అరివళగన్(27) ఉన్నాడు. అకస్మాత్తుగా అరివళగన్ తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఐటీ ఉద్యోగి తనతో గొడవ పడ్డాడని, మణప్పారై వద్ద ఉన్న కొలను వద్దకు రావాలని చెప్పాడు.
ఈ మేరకు ఐదుగురు వచ్చాక ఆ ఉద్యోగిని బస్సు నుంచి బలవంతంగా కిందికి దింపారు. సమీపంలోని కొలను వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రియాజ్ (24) అనే వ్యక్తి ఐటీ ఉద్యోగిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి రూ.75వేల నగదు ఇవ్వాలని బెదిరించాడు. బాధితుడు నగదు వారికి పంపి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రియాజ్, అరివళగన్, అరుణ్ కుమార్, లియోబ్లాయిడ్, సెంథిల్ కుమార్, మరొకరిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






