- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
300 మీటర్ల లోయలోకి పడిపోయిన బస్సు..
by Vinod kumar |
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.

X
మండి(హిమాచల్ ప్రదేశ్) : హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 40 మందితో వెళ్తున్న హిమాచల్ ఆర్టీసీ బస్సు కర్సోగ్ టౌన్ సమీపంలోని ఖరోడి గ్రామం శివార్లలో మూల మలుపు వద్ద అదుపు తప్పి 300 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. అదృష్టవశాత్తు బస్సు రోడ్డుపై నుంచి లోయలోకి దొర్లుతుండగా రెండు చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం కర్సోగ్ టౌన్ లోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని సిమ్లాలోని ఆస్పత్రులకు రిఫర్ చేశారు. గాయపడిన డ్రైవర్, కండక్టర్, ఇతర ప్రయాణికుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Next Story






