- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమేనీ కుటుంబంలో నలుగురు మృతి!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫ్యామిలీలో మొత్తం నలుగురు చనిపోయినట్లు ఇరాన్ మీడియా అధికారికంగా ప్రకటన చేసింది.

దిశ, వెబ్ న్యూస్: ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫ్యామిలీలో మొత్తం నలుగురు చనిపోయినట్లు ఇరాన్ మీడియా అధికారికంగా ప్రకటన చేసింది. ఆయన కూతురు, అల్లుడు, కోడలు, మనవడు మొత్తం నలుగురు చనిపోయినట్లు స్పష్టం చేసింది. ఈ జాయింట్ ఆపరేషన్ లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఇంటిపై 30 బాంబులు వదిలినట్లు కథనాలు వస్తున్నాయి. ఇందు కోసం ఇజ్రాయిల్ కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తోందని... అగ్ర నాయకులు అందరూ ఒకే దగ్గర ఉండగా అటాక్ చేసిందని మీడియా స్పష్టం చేసింది.
ఇక అదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయినట్లు ట్రంప్ కూడా అధికారికంగా వెల్లడించారు. అటు ఇరాన్‌లో దుర్భర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 201 మంది మృతి చెందారు. 24 ప్రావిన్స్‌లపై ఇజ్రాయెల్-US సంయుక్తంగా చేసిన దాడుల్లో 201 మంది మృతి చెందారని ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రతినిధి మెహర్ వెల్లడించింది. అంతేకాదు.. 750 మందికి పైగా ఇరానియన్లు గాయపడ్డారని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. మరోవైపు.. యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇరాన్‌లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులు, తమని కాపాడాలని వీడియోలు పెడుతున్నారు.






