- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పుల్వామా అటాక్’కు ఏడేళ్లు.. జమ్మూ, శ్రీనగర్‌లో హై అలర్ట్
పుల్వామా ఉగ్రదాడి జరిగి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు 'హై అలర్ట్' ప్రకటించి, డ్రోన్ల ద్వారా నిఘాను పటిష్టం చేశాయి. అమర జవాన్లకు నివాళులర్పిస్తూనే, శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వంటి కీలక ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆర్మీ (Indian Army) చరిత్రలో అత్యంత విషాదకరమైన ‘పుల్వామా టెర్రర్ అటాక్’ (Pulwama Terror Attack) జరిగి నేటితో ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించడంతో పాటు జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) అంతటా భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా శ్రీనగర్, పుల్వామా ప్రాంతాల్లో ‘హై అలెర్ట్’ ప్రకటించారు. శ్రీనగర్‌లోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన లాల్ చౌక్, ఆ పరిసరాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పర్యాటకులు, ఇతర ప్రయాణికులు ఉంటున్న హోటళ్లలో సోదాలు నిర్వహిస్తూ, వారి ఐడీ కార్డులను చెక్ చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘాను పటిష్టం చేశారు.
కాగా, 2019, ఫిబ్రవరి 14న జమ్మూ నుంచి శ్రీనగర్‌కు సుమారు 2,500 మంది సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లు కాన్వాయ్‌లో వెళ్తుండగా పుల్వామా జిల్లాలోని లేథిపూర, అవంతిపురా వద్ద ఆత్మాహుతి బాంబర్ వాహనంలో వారి బస్సును బలంగా ఢీకొట్టాడు. అనంతరం జరిగా భారీ పేలుడులో 40 మంది జవాన్లు అక్కడికక్కడే వీర మరణం పొందారు. నాడు ఈ ఘటన యావత్ దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టింది.






