- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్క స్కూటీపై ఏడుగురు యువకులు రైడింగ్.. పచ్చి బూతులతో.. రోడ్డుపై వీరంగం.. (వీడియో)
ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో రోడ్డుపై వీరంగం సృష్టించారు యువకులు. ధనుపాలి ప్రాంతంలో ఒకే స్కూటీపై ఏడుగురు యువకులు ప్రయాణిస్తూ రచ్చ చేశారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకోగా.. అసభ్యకరమైన పదజాలంతో తోటి వారిపై రెచ్చిపోయారు.

దిశ, వెబ్ డెస్క్ : ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో రోడ్డుపై వీరంగం సృష్టించారు యువకులు. ధనుపాలి ప్రాంతంలో ఒకే స్కూటీపై ఏడుగురు యువకులు ప్రయాణిస్తూ రచ్చ చేశారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకోగా.. అసభ్యకరమైన పదజాలంతో తోటి వారిపై రెచ్చిపోయారు. నిర్లక్ష్యంగా స్కూటీ నడుపుతూ.. ఇబ్బంది పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. గంటలోపే యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు మైనర్లు అని గుర్తించారు. స్కూటీ సీజ్ చేసి ఓనర్‌పై మోటార్ వాహన చట్టం ఉల్లంఘన కింద కేసులు పెట్టారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది రైడింగ్, మైనర్లను డ్రైవింగ్‌కు అనుమతించడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడంపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. రూ. 21,500 జరిమానా విధించారు.
ఈ ఘటనపై మాట్లాడిన సంబల్పూర్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ రామ్ దాస్.. ట్రాఫిక్ ఉల్లంఘనలు, స్టంట్స్ చేయొద్దని సూచించారు. ముఖ్యంగా మైనర్లు ఇలాంటి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలను కోరారు. వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించిన పోలీసులు.. భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూసుకోవాలని, లేదంటే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.






