ప్రధాని మోడీతో సెర్గియో గోర్ భేటీ

by Phanindra |

ప్రధాని మోడీతో భారత్‌లో అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు గోర్ తెలిపారు.

ప్రధాని మోడీతో సెర్గియో గోర్ భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాయబారిగా యూఎస్ డెజిగ్నేట్ చేసిన సెర్గియో గోర్‌.. ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. భారత్‌పై యూఎస్ అదనపు సుంకాల నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. ‘ప్రధాని నరేంద్ర మోడీతో అద్భుతమైన సమావేశం జరిగింది. వాణిజ్యం, క్రిటికల్ ఖనిజాలు, రక్షణ వంటి అంశాలపై చర్చించాం’ అని గోర్ తెలిపారు. ఆయనతోపాటు యూఎస్ డిప్యూటీ సెక్రెటరీ ఫర్ మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్స్ మైఖేల్ జే రిగాస్ కూడా ప్రధాని మోడీని కలిశారు.

ఈ సమావేశం గురించి తన సోషల్ మీడియాలో స్పందించిన మోడీ.. ‘భారత్‌లో అమెరికా రాయబారి డెజిగ్నేట్‌ను రిసీవ్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన హయాంలో భారత్, యూఎస్ మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని నమ్ముతున్నా’ అని పేర్కొన్నారు. ప్రధానిని కలిసే ముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కూడా గోర్ కలిశారు.

Next Story