బిహార్ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య నెక్ టు నెక్ ఫైట్.. సి-ఓటర్ సర్వేలో వారిదే విజయం

by Prasad Jukanti |   (  Updated:2025-10-12 12:05:47  IST  )

సి ఓటర్ సర్వేలో నితీశ్ కుమార్‍కు బిహార్ ఓటర్లు షాక్ ఇచ్చారు.

బిహార్ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య నెక్ టు నెక్ ఫైట్.. సి-ఓటర్ సర్వేలో వారిదే విజయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar elections 2025) పోరులో ఎన్డీయే, ఇండియా కూటమి (మహాఘట్ బంధన్), ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. మొదటి విడత కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బిహార్ ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఎవరిని ఇంటికి పంపనున్నారు అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సి-ఓటర్ సర్వే (C-Voter survey) సంచలన విషయాలు వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం జేడీయూ-బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి బిహార్ ప్రజలు జై కొట్టబోతున్నట్లు వెల్లడైంది. ఎన్డీయే కూటమికి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 40.2 శాతం అవకాశాలు ఉన్నాయని మహాఘట్ బంధన్ (INDIA bloc)కి 38.3 శాతం, జన్ సూరజ్ పార్టీకి 13.3 శాతం అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. అయితే ఎన్డీయే కూటమి, ఇండియా కూటమికి మధ్య కేవలం 2 శాతం మాత్రమే తేడా ఉండటంతో అంతిమంగా విజయం ఎవరి వైపు నిలవబోతోందని అనేది సంచలనంగా మారింది.

సీఎంగా తేజస్వీకి మద్దతు:

ఒక వేళ ఎన్డీయే (NDA alliance) అధికారం ఏర్పాటు చేస్తే నితీశ్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రిగా కొనసాగాలా అనే ప్రశ్నకు 47.6 శాతం మంది ఓటర్లు ఓకే చెప్పగా 39.7 శాతం మంది నో చెప్పారు. ఏమీ చెప్పలేమని మరో 121.7 శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించారు. పార్టీల పరంగా బలాబలాలు ఎలా ఉన్నా ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే ప్రశ్నకు భిన్నమైన సమాధానం వచ్చింది. ఇందులో ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ మూడో స్థానానికి పడిపోయారు. బిహార్ ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు ఏకంగా 36.2 శాతం మంది మద్దతు ఇవ్వగా 23.2 శాతంతో ప్రశాంత్ కిశోర్ రెండో స్థానంలో నిలిచారు. 15.9 శాతంతో నితీశ్ కుమార్, 8.8 శాతంలో చిరాగ్ పాశ్వాన్, 7.8 శాతంతో బీజేపీ నేత సామ్రాట్ చౌదరికి మద్దతు లభించింది. ఇక ఓటు నిర్ణయాన్ని ప్రధానంగా ఏ అంశం ప్రభావితం చేయబోతోందనే ప్రశ్నకు అభ్యర్థుల స్థానిక అంశం 19 శాతం ప్రభావితం చేయబోతోందని, పార్టీ సిద్ధాంతాలు 28.4 శాతం పని చేయబోతున్నాయని తేలింది. ప్రత్యేక సమస్యలు 32.7 శాతం, జాతీయాంశాలు 4.0, సీఎం పనితీరు 5.6 శాతం, ప్రధాని పనితీరు 3.6 శాతం పని చేయబోతోందని అంచనా వేసింది.

బిహార్ సమస్యలు తీర్చేది వాళ్లే:

కూటమి పట్ల సంతృప్తిగా లేకపోతే ఎవరు పొత్తులను మార్చుకునే అవకాశం ఉందనే ప్రశ్నకు చిరాగ్ పాశ్వాన్ పొత్తు మార్చుకునే అవకాశం ఉందని 35.1 శాతం మంది జితన్ మాంఝీ 15 శాంత, ఉపేందర్ కుశ్వా 5 శాతం ముకేశ్ షైనీ 12.7 శాతం అలయెన్స్ నుంచి స్విచ్ అవుతారని అభిప్రాయపడ్డారు. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ గందరగోళం సృష్టించిన ఎస్ఐఆర్ ఎలక్షన్ లో నిష్పక్షపాతాన్ని మెరుగు పరిచిందా అని ప్రశ్నించగా అవును ఇప్పుడు పోల్స్ కచ్చితంగా పారదర్శకంగా జరుగుతాయని 42.6 శాతం మంది అభిప్రాయపడగా గందరగోళానికి కారణం అయిందని 31 శాతం, ఈ విషయంపై అభిప్రాయం చెప్పడానికి ఇది చాలా తొందర అవుతుందని 16.5 శాతం మంది, ప్రభావితం కాదని 3.5 శాతం మంది చెప్పారు. బిహార్ సమస్యలు ఎవరు తీరుస్తారనే ప్రశ్నకు మహాఘట్ బంధన్ కు 36 శాతం, ఎన్డీయే కూటమికి 34 శాతం, జన్ సూరజ్ కు 13, ఎవరూ తీర్చలేరని 9 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ఇండియా కూటమికి రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ అధికార్ యాత్ర హెల్ప్ అయిందని 51 శాతం మంది అభిప్రాయపడగా 32.8 శాతం హెల్ప్ కాలేదని చెప్పారు.

Next Story