ఎర్రకోట వద్ద పేలుడు కేసు దర్యాప్తులో సంచలనం.. ఆరుగురు డాక్టర్లు అరెస్ట్

by Gantepaka Srikanth |

ఢిల్లీలోని ఎర్రకోట(Red Fort Blast) వద్ద చోటుచేసుకున్న బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

ఎర్రకోట వద్ద పేలుడు కేసు దర్యాప్తులో సంచలనం.. ఆరుగురు డాక్టర్లు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ఎర్రకోట(Red Fort Blast) వద్ద చోటుచేసుకున్న బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అల్‌ఫలాహ్‌ వర్సిటీ(Alfalah University)లో ఆరుగురు జూనియర్ డాక్టర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడిన ఉమర్.. యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మరోవైపు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. కేంద్ర హోంశాఖ ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ‘ఎన్‌ఐఏ’ ఉగ్రవాద సంబంధిత కేసులను దర్యాప్తు చేస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రెండుసార్లు సమావేశం నిర్వహించి.. ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించారు. పేలుడు ఘటనపై అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని, సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం వెలువడింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) సైతం హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ కేసులో మృతుల సంఖ్య 12కు పెరిగింది.

Next Story