నా ఓటు నేనే వేశా.. ఆమెవరో నాకు తెలియదు.. బ్రెజిల్ మోడల్ వివాదంపై తెరముందుకు మహిళా ఓటరు

by Prasad Jukanti |   (  Updated:2025-11-06 09:53:52  IST  )

హర్యానా ఓటర్ జాబితాపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఓ మహిళా ఓటరు సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా ఓటు నేనే వేశా.. ఆమెవరో నాకు తెలియదు.. బ్రెజిల్ మోడల్ వివాదంపై తెరముందుకు మహిళా ఓటరు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతేడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో లక్షలాది నకిలీ ఓట్ల ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిన్న చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాయ్ నియోజకవర్గంలో ఒక ఐడీపై ఏకంగా 22 నకిలీ ఓట్లు ఉన్నాయని వాటిపై బ్రెజిల్‍కు చెందిన ఒక మహిళా మోడల్ (Brazilian model photo)ఫోటో ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఫేక్ ఐడీతో ఉన్న 22 ఓట్లు పోలింగ్ లో నమోదు అయ్యాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు మరింత దుమారం రేపుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో మునేశ్ అనే మహిళ మీడియా ముందుకు వచ్చింది. తన ఓటు హక్కు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న ఐడీ వరుసలోనే ఉందని అయితే నా ఓటు నేను వేశాను. ఆ ఆ బ్రెజిల్ మహిళ ఎవరో నాకు తెలియదని అన్నారు. నా దగ్గర ఉన్న కార్డులో నా ఫోటోనే ఉందని కానీ రాహుల్ గాంధీ చూపిన కార్డులో నా ఫోటో లేదన్నారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతున్న వేళ బ్రెజిల్ మోడల్ పేరుతో జరుగుతున్న ప్రచారంపై ఓ మహిళ ఓటరు ముందుకు రావడంతో ఈ పరిణామం ఎటువైపు వెళ్తుందో చూడాలి మరి.

Next Story