దేశ రాజధానిలో సంచలనం.. ఎర్రకోటలోకి డమ్మీ బాంబులతో వెళ్లేందుకు యత్నించిన బంగ్లాదేశీలు అరెస్ట్

by Kema Shiva Kumar |

దేశ రాజధాని ఢిల్లీలో సంచలన చోటుచేసుకుంది.

దేశ రాజధానిలో సంచలనం.. ఎర్రకోటలోకి డమ్మీ బాంబులతో వెళ్లేందుకు యత్నించిన బంగ్లాదేశీలు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో సంచలన చోటుచేసుకుంది. ఏకంగా ఎర్రకోటలోకి వెళ్లేందుకు యత్నించిన ఐదుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 15న జరిగే కార్యక్రమాల కోసం ఎర్రకోట ప్రాంగణంలో రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. అయితే, స్పెషల్ సెల్ బృందం శనివారం కూడా ఓ డ్రిల్ నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే సాధారణ దుస్తు్ల్లో ఐదుగురు బంగ్లాదేశీయులు ఒంటి నిండా నకిలీ బాంబాలను అమర్చుకుని ఎర్రకోటలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించారు. కానీ, భద్రత కోసం నియమించబడిన ఏడుగురు పోలీసు సిబ్బంది, కానిస్టేబుళ్లు, మరో హెడ్ కానిస్టేబుల్ వారిని గుర్తించ లేకపోయారు. ఎట్టకేలకు వారిని సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని సస్పండ్ చేస్తూ.. కమిషనర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి,

Next Story