- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై ఎయిర్‌పోర్టులో సంచలనం.. ప్రయాణికుడి బ్యాగ్‌లో అరుదైన పాములు!
మహారాష్ట్రలోని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అరుదైన జాతి పాములు కలకలం సృష్టించాయి.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (Chhatrapati Shivaji Maharaj International Airport) అరుదైన జాతి పాములు (Rare snakes) కలకలం సృష్టించాయి. ఓ ప్రయాణికుడు అక్రమంగా వీటిని విదేశాల నుంచి భారత్‌కు తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని తమిళనాడుకు చెందిన గుడ్‌మాన్ లిన్‌ఫర్ట్ లియోగా అధికారులు గుర్తించారు. అతడు గ్రీన్ ఛానల్ ద్వారా బయటకు వెళ్లే క్రమంలో అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు అతన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అతని బ్యాగ్‌లో నిషేధిత, ఎగ్జాటిక్ పాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ పాములు అనేక దేశాలలో ప్రత్యేక సంరక్షణ పొందుతున్న జాతులకు చెందినవిగా అధికారులు తెలిపారు. వీటిని ఏ విధమైన అధికార అనుమతులు లేకుండా దేశంలోకి తీసుకురావడం వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందన్నారు. అధికారులు ఈ పాములను జాగ్రత్తగా స్వాధీనం చేసుకుని, వాటిని ప్రాథమిక వైద్య పరీక్షల నిమిత్తం ముంబై ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. ప్రాథమికంగా వీటిలో కొన్ని ఆఫ్రికన్ లేదా సౌత్ అమెరికన్ ప్రాంతాలకు చెందినవని అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కస్టమ్స్ శాఖ అధికారికంగా కేసు నమోదు చేసి, అధికారులు నిందితుడిని విచారిస్తున్నారు. అతడు ముందుగా ఎక్కడి నుంచి ప్రయాణించి వచ్చాడు?, పాములు ఎక్కడ నుంచి తెచ్చాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు.






