- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ బ్లూస్టార్ నిర్ణయం తప్పు.. కాంగ్రెస్ నేత చిదంబరం కామెంట్స్ వైరల్!
ఆపరేషన్ బ్లూస్టార్ నిర్ణయం తప్పేనని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆ పార్టీ నేతలే ఆయనపై మండిపడుతున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’పై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఆపరేషన్ తప్పు అని ఆయన ప్రకటించారు. హిచామల్‌లోని కసోలీలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ‘ఏ మిలిటరీ ఆఫీసర్‌నూ అగౌరవపరచడం నా ఉద్దేశ్యం కాదు. కానీ స్వర్ణదేవాలయాన్ని సాధించుకోవడానికి పద్ధతి అది కాదు. ఆ తర్వాత కొన్నేళ్లకే ఆర్మీని ఉపయోగించకుండా ఆలయాన్ని ఎలా సాధించాలో మనమే చేసి చూపించాం. బ్లూస్టార్ తప్పుడు పని, దానికి ప్రతిఫలంగానే ఇందిరా గాంధీ ప్రాణాలు పోగొట్టుకున్నారు’ అని అన్నారు. అయితే స్వర్ణదేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆర్మీ సాయంతో చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’ కేవలం ఇందిరా గాంధీ నిర్ణయం కాదని చిదంబరం వివరించారు. ఆర్మీ, పోలీసు, ఇంటెలిజెన్స్, సివిల్ సర్వీసు అధికారులు అందరూ కలిసే ఆ నిర్ణయం తీసుకున్నారని, కాబట్టి కేవలం ఇందిరా గాంధీనే ఈ విషయంలో విమర్శించడం తగదని ఆయన చెప్పారు.
క్రిమినల్ కేసుల ఒత్తిడితోనే..
ఈ వ్యాఖ్యలతో ఖంగుతిన్న కాంగ్రెస్.. చిదంబరంపై విమర్శలు చేసింది. చిదంబరంపై చాలా క్రిమినల్ కేసులున్నాయని, వాటి నుంచి తప్పించుకోవాలనే ఒత్తిడితోనే ఇలా ఆయన బీజేపీ వాదన వినిపిస్తున్నారని కాంగ్రెస్ కీలక నేత రషీద్ అల్వీ ఆరోపించారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్ సరైనదా? కాదా? అనేది వేరే చర్చ. కానీ 50 ఏళ్ల తర్వాత ఈ విషయంలో కాంగ్రెస్‌ను చిదంబరం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇందిరా గాంధీ తప్పు చేశారని చెప్పడం ద్వారా బీజేపీ, పీఎం మోడీ చేసే పనే ఆయన కూడా చేస్తున్నారు’ అంటూ అల్వీ ఆగ్రహం వ్యక్తంచేశారు.






