- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ బీజేపీ నేత ప్రేమ్ కుమార్
ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి (NDA alliance) భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోడీ ప్రకటన ప్రకారం బీహార్ సీఎంగా నితీష్ కుమార్ 10వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి ఇప్పటికే డిప్యూటీ సీఎం, హోంమంత్రి సహా కీలక మంత్రి పదవులు దక్కాయి. అయితే తాజాగా బీహార్ అసెంబ్లీ స్పీకర్ (Bihar Assembly Speaker) గా సీనియర్ బీజేపీ నాయకుడు ప్రేమ్ కుమార్ (Prem Kumar) మంగళవారం (డిసెంబర్ 2) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని సభలో ప్రొటెం స్పీకర్ నరేంద్ర నారాయణ్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు.
స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఏకైక అభ్యర్థి ప్రేమ్ కుమార్ అని ఆయన సభకు తెలియజేశారు. అనంతరం వాయిస్ ఓటు ద్వారా ప్రేమ్ కుమార్ ఏకగ్రీవంగా (Unanimously) ఎన్నికైనట్లు నరేంద్ర నారాయణ్ యాదవ్ (Narendra Narayan Yadav) ప్రకటించారు. సీనియర్ నేత అయిన ప్రేమ్ కుమార్ ఎన్నిక కావడంతో, బీహార్ రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు సజావుగా సాగడానికి మార్గం సుగమమైంది. ప్రతిపక్షాల నుంచి కూడా ఎవరూ పోటీ చేయకపోవడంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి.






