- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘Good bye India’ విమాన ప్రమాదానికి ముందు బ్రిటీష్ ప్రయాణికుల సెల్ఫీ వీడియో వైరల్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: (Air India plane crash) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 171 విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే నేలకూలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి విమానంలో ప్రయాణికుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు బ్రిటీష్ ప్రయాణికులు (British passengers) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా (Selfie video) సెల్ఫీ వీడియోను రికార్డు చేశారు. (Jamie Ray Meek) జేమీ రే మీక్ అనే ప్రయాణికుడు విమానం ఎక్కేముందు అహ్మదాబాద్ విమానాశ్రయం లోపల కూర్చుని వీడియో రికార్డు చేస్తారు.
అందులో ‘మేము విమానాశ్రయంలోకి ఇప్పుడే వచ్చాము. లండన్‌కు తిరిగి వెళ్లేందుకు 10 గంటల సమయం పడుతుంది. (Good bye India) గుడ్ బై ఇండియా అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ భారత్‌కు వీడ్కోలు పలుకుతారు. చాలా సంతోషంగా ఉంది.. ప్రశాంతంగా తిరిగి వెళ్తున్నాని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో జ్ఞాపకాలతో విమానం ఎక్కిన ప్రయాణికులు.. ఇలా ప్రమాదం జరగడం దురదృష్టకరమని నెటిజన్లు సంతాపం తెలిపారు.
కాగా, ఈ విమానంలో సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉండగా వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ పౌరుడు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రయాణికుల్లో ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని అసోసియేటెడ్ ప్రెస్ ప్రకటించింది. అసోసియేటెడ్ ప్రెస్‌కు అహ్మదాబాద్ సీపీ తెలిపినట్లు వెల్లడించింది. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా మృతదేహాలు ఉన్నాయి. పేలుడు ధాటికి గుర్తు పట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు ఉండటంతో శకలాలు తొలగించి మృతదేహాలు ఆసుపత్రికి తరలించారు.






