కర్రెగుట్టను మళ్లీ చుట్టుముట్టిన భద్రతా బలగాలు

by Gantepaka Srikanth |

కర్రెగుట్టను మళ్లీ చుట్టుముట్టిన భద్రతా బలగాలు

కర్రెగుట్టను మళ్లీ చుట్టుముట్టిన భద్రతా బలగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు(Telangana-Chhattisgarh Border)లోని బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట(Karregutta)ను మరోసారి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ తయారీ సామగ్రి, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. అంతకుముందు ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని (ఏఓబీ)లో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాలో 22 మంది మావోయిస్టులు ఒడిశా డీజీపీ ఎదుట లొంగిపోయారు. వరుస ఆపరేషన్లు, భద్రతా బలగాల ఒత్తిడి నేపథ్యంలో ఈ లొంగుబాటుకు ప్రాధాన్యత సంతరించుకుంది. లొంగిపోయిన వారిలో ఆరుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు సహా మొత్తం 15 మంది కీలక మావోయిస్టు సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు ఆయుధాలు, పేలుడు సామగ్రిని కూడా పోలీసులకు అప్పగించారు.

Next Story