- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoist Martyrs: పురాతన మావోయిస్టు స్మారక స్థూపం కూల్చివేత.. ఇంద్రావతి నది తీరంలో గుర్తించిన బలగాలు
‘ఆపరేషన్ కగార్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని దండకారణ్యంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నక్సల్స్ అలజడి వినిపించిందనే సమాచారంతో అడవులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు సంబంధించిన అమరవీరుల స్మారక (Martyrs' Monuments) చిహ్నాలను కూల్చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టుల భారీ స్మారక స్థూపాన్ని భద్రతా బలగాలు కూల్చేశాయి. బంగోలి గ్రామ సమీపంలోని ఇంద్రావతి నది ప్రాంతంలో ఈ స్తూపాన్ని బలగాలు గుర్తించాయి.
15 అడుగుల ఎత్తున్న పురాతనమైన స్తూపాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, వచ్చే ఏడాది మార్చిలోపు మావోయిస్టులను తుదముట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 2024 లో ఆపరేషన్ కగార్ మొదలయ్యాక గచిన 18 నెలల కాలంలో 412 మంది మావోయిస్టులను కేంద్ర బలగాలు హతమార్చాయి. ఇక, ఈ ఏడాది ఇప్పటికే 14 భారీ ఎన్‌కౌంటర్లలో 203 మంది నక్సల్స్ మరణించినట్లు పోలీసుల సమాచారం. మరోవైపు ఈ వర్షాకాలంలోనూ కూంబింగ్ కొనసాగుతుందని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు ఆడవులను జల్లెడ పడుతున్నాయి.






