IED Bombs: బస్తర్ పరిధిలో 5 కిలోల ఐఈడీ బాంబుల కలకలం.. తప్పిన పెను ప్రమాదం

by Ramesh Naini |

దక్షిణ బస్తర్ దంతెవాడ జిల్లా మాలేవాహి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఐఈడీ బాంబుల కలకలం చోటు చేసుకుంది.

IED Bombs: బస్తర్ పరిధిలో 5 కిలోల ఐఈడీ బాంబుల కలకలం.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణ బస్తర్ దంతెవాడ జిల్లా మాలేవాహి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఐఈడీ బాంబుల కలకలం చోటు చేసుకుంది. 2026 జనవరి 4న ఉదయం 9 గంటలకు సీఆర్‌పీఎఫ్ క్యాంప్ సాతధార్ నుంచి ద్వితీయ కమాండ్ అధికారి విక్రాంత్ వర్మ (సీఆర్‌పీఎఫ్ 195 బటాలియన్) నేతృత్వంలో యంగ్ ప్లాటూన్ బలగాలు, మాలేవాహి పోలీస్ స్టేషన్‌కు చెందిన జిల్లా బలగాలతో కలిసి రోడ్ డీ మైనింగ్ డ్యూటీకి బయలుదేరాయి.

అక్కడికక్కడే నిర్వీర్యం...

సాతధార్, మాలేవాహి మధ్య రోడ్డు పక్కన అటవీ ప్రాంతంలో డీ–మైనింగ్ చర్యలు చేపడుతున్న సమయంలో, నక్సల్స్ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని అమర్చిన సుమారు 5 కిలోల బరువున్న పాత ప్రెషర్ కంటైనర్ ఐఈడీ బాంబును సీఆర్‌పీఎఫ్ బీడీఎస్ (బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్) బృందం గుర్తించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఐఈడీ బాంబులను అక్కడికక్కడే సురక్షితంగా నిర్వీర్యం చేశారు. ఈ ఘటనతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story