- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మే 31న సరిహద్దు రాష్ట్రాల్లో సెక్యూరిటీ డ్రిల్స్
by Phanindra |
మే 31న సరిహద్దు రాష్ట్రాల్లో సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన భద్రతా దళాలు. ఇక నుంచి ప్రతినెలా తప్పనిసరి.

X
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌తో సరిహద్దు పంచుకునే గుజరాత్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహించేందుకు భద్రతా దళాలు సిద్ధమయ్యాయి. గురువారం నాడు నిర్వహించాల్సిన ఈ మాక్ డ్రిల్స్.. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 31న (శనివారం నాడు) గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇటీవల భారత్, పాక్ ఉద్రిక్తతల సమయంలో ఈ రాష్ట్రాల్లో డ్రోన్స్, మిసైల్స్‌తో పాకిస్తాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీమాంతర ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో ఇకపై ప్రతినెలా ‘ఆపరేషన్ షీల్డ్’ పేరిట సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహించాలని భద్రతా దళాలు నిర్ణయించాయి.
Next Story






