- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు బీహార్‌లో రెండోదశ పోలింగ్
దిశ, వెబ్ డెస్క్: బీహార్ లో తుది దశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. బీహార్ రాష్ట్రంలో ఇప్పటికే తొలి దశ పోలింగ్ పూర్తికాగ

దిశ, వెబ్ డెస్క్: బీహార్ లో తుది దశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. బీహార్ రాష్ట్రంలో ఇప్పటికే తొలి దశ పోలింగ్ పూర్తికాగా ఇవాళ చివరి దశ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి దశ పోలింగ్ లో 20 జిల్లాల్లోని 122 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇవాళ ఉదయం 7 గంటల సమయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 1302 మంది అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇందులో ఒక ట్రాన్స్ జెండర్ కూడా ఉన్నారు.
మొదటి దశలో 65.08% పోలింగ్ నమోదయింది. ఈ సారి ఇదే కంటిన్యూ అవుతుందా ? లేక పోలింగ్ శాతం తగ్గుతుందా? అనే అంశం హాట్ టాపిక్ అయింది. ఇక రెండు దశల్లో కలిపి ఈ నెల 14వ తేదీన అధికారులు ఓట్ల లెక్కింపు చేసి, ఫలితాలు ప్రకటన చేయనున్నారు. తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఉప ఎన్నిక ఫలితం కూడా 14వ తేదీన వెలువడనుంది.






