జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట..డ్రోన్లు, త్రీడీ మ్యాపింగ్‌ సాయంతో గాలింపు

by Ajay Maddhiboyina |

జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్రవేట కోనసాగుతూనే ఉంది. గత నెల 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పలు జరిపిన సంగతి తెలిసిందే.

జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట..డ్రోన్లు, త్రీడీ మ్యాపింగ్‌ సాయంతో గాలింపు
X

దిశ, వెబ్ డెస్క్: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్రవేట కోనసాగుతూనే ఉంది. గత నెల 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు 10 రోజులు అవుతున్నా వారిని పట్టుకోలేదు. కేంద్రం ఉగ్రదాడిని సీరియస్‌గా తీసుకున్నామని చెప్పినప్పటికీ నింధితులను ఇప్పటి వరకు పట్టుకోకపోవడంపై ఆగ్రహజ్వాలలు కనిపిస్తున్నాయి. అసలు దాడి జరగటం వెనుకనే ఇంటిలిజెన్స్ వైఫల్యం ఉండగా, నింధితులను పట్టుకోవడంలోనూ ఆలస్యం జరుగుతుండటంపై ప్రజలు మండిపడుతున్నారు.

ఇక ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో డ్రోన్లు, త్రీడీ మ్యాపింగ్ సాయంతో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది. దచిగామ్, కుల్గామ్, షోపియాన్, అనంత్ నాగ్ ప్రాంతాల్లో మరియు పహల్గామ్ చుట్టుపక్కల అడవుల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. మరోవైపు చైన్నై నుండి శ్రీలంకకు విమానంలో ఆరుగురు అనుమానితులు వెళ్లారని మెయిల్ రావడంతో కొలంబోలో విమానంలో తనిఖీలు నిర్వహించారు. కానీ విమానంలో అనుమానితులు ఎవరూ కనిపించలేదని అధికారులు తెలిపారు.

Next Story