- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Scindia: త్వరలోనే భారత్‌లో 6G సేవలు.. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
2030 నాటికి భారత్ 6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆశాభావం వ్యక్తం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: 2030 నాటికి భారత్ 6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన టైమ్ గ్రూప్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (Global business summit) లో ఆయన ప్రసంగించారు. భారత టెలికాం సంస్థలు చేసిన కృషి వల్లే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5G దేశంలో అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. 22 నెలల్లోనే 99 శాతం జిల్లాలను 5G సేవలతో విజయవంతంగా ప్రవేశపెట్టాన్నారు. భారతదేశ ఆర్థిక ప్రయాణంలో కీలక మార్పును కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో 2027 నాటికి, జర్మనీ (Jarmany), జపాన్ (Japan)లను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని తెలిపారు. అలాగే 2028 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు.
భారత్‌లో 6G సేవలపై స్పందిస్తూ ఇప్పటికే 6G టెస్ట్ బిడ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. రూ. 300 కోట్ల వ్యయంతో దాదాపు 111 పరిశోధన ప్రాజెక్టులను ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. ‘4Gలో ప్రపంచాన్ని అనుసరించాం. 5G లో ప్రపంచంతో పాటు వేగాన్ని కొనసాగించాం. 6G లో ప్రపంచంతో పాటు దేశాన్ని నడిపిస్తాం’ అని తెలిపారు. 6G టెస్టింగ్ దశలో ఉందని, ఇది లాంచ్ అయిన తర్వాత వినియోగదారులు 100 Mbps వరకు వేగాన్ని పొందుతారని తెలిపారు. ప్రపంచంలో స్వదేశీ 4G టెక్నాలజీ స్టాక్‌ను అభివృద్ధి చేసిన ఐదో దేశం భారత్ అని తెలిపారు. దీనిని ప్రభుత్వ సంస్థ C-DOT, రెండు ప్రైవేట్ కంపెనీలు తేజస్ నెట్‌వర్క్స్, సిస్టమ్ ఇంటిగ్రేటర్ (టీసీఎస్) నిర్మించాయన్నారు.






