- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: ఉగ్రస్థావరాలపై దాడులు.. భారత్‌లో ఎయిర్‌పోర్టులు, విద్యాసంస్థలు మూసివేత
పాక్ ఉగ్రస్థావరాలపై దాడుల నేపథ్యంలో భారత్ లో కొన్ని ఎయిర్‌పోర్టులను మూసివేసినట్లు (Airports Closed) కేంద్రం ప్రకటించింది. నార్త్ ఇండియాలోని (North India) జమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్ సర్ ఎయిర్ పోర్టులను తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకూ మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై "ఆపరేషన్ సింధూర్" (Operation Sindoor) పేరిట దాడులు నిర్వహించింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ (Indian Air Force), నేవీ సంయుక్తంగా.. ఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో చేసిన ఈ దాడుల్లో తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇండియన్ ఆర్మీ (Indian Army) వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో భారత్ ఈ చర్యలకు పూనుకుంది.
పాక్ ఉగ్రస్థావరాలపై దాడుల నేపథ్యంలో భారత్ లో కొన్ని ఎయిర్‌పోర్టులను మూసివేసినట్లు (Airports Closed) కేంద్రం ప్రకటించింది. నార్త్ ఇండియాలోని (North India) జమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్ సర్ ఎయిర్ పోర్టులను తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకూ మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా ఎయిర్ పోర్టులు మూతపడ్డాయి. దీంతో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని ఎయిర్ లైన్స్ సంస్థలు కోరాయి. కాగా.. అమృత్‌సర్‌కు వెళ్లాల్సిన రెండు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ను ఢిల్లీకి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనగర్(Srinagar)కు విమాన సర్వీసుల్ని రద్దు చేసినట్లు స్పైస్ జెట్ వెల్లడించింది. విమాన సర్వీసుల్ని పునరుద్ధరించినపుడు ప్రకటన చేస్తామని తెలిపింది.
మరోవైపు ఖతార్ ఎయిర్‌వేస్ (Qatar Airways) పాకిస్థాన్‌కు తాత్కాలికంగా విమాన సర్వీసుల్ని మూసివేసింది. పాక్ గగనతలం మూతపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని ఖతార్ ఎయిర్‌వేస్ పేర్కొంది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు ఎయిర్‌పోర్ట్, ఫ్లైట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని ఆయా విమానయాన సంస్థలు కోరాయి.
కాగా.. ఉగ్రస్థావరాలపై దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. జమ్మూ, సాంబా, కథువా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను స్వచ్ఛందంగా మూసివేశారు.






