- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ దారుణం.. షాకింగ్ విషయాలు చెప్పిన తల్లి
నాలుగేళ్ల బాలికపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నాలుగేళ్ల బాలికపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో చోటుచేసుకుంది. బాలికపై డ్రైవర్ డిజిటల్ అత్యాచారం చేశాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ ఫైర్ చేసి నిందితుడు మొహమ్మద్ ఆరిఫ్ ను అరెస్ట్ చేసినట్లు డీసీపీ శశాంక్ సింగ్ తెలిపారు. ఆరిఫ్, కిడ్జీ స్కూల్ మేనేజర్ సందీప్ కుమార్ పై పోక్సో చట్టంలోని బీఎన్ఎస్ సెక్షన్ 5(ఎం)/6, ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్లు 3(2) (వి), 3 (2) కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
బాధితురాలి తల్లి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. తన నాలుగేళ్ల కూతురు ప్రతిరోజూ స్కూల్ బస్సులోనే స్కూల్ కి వెళ్లి వస్తుంది. ఇటీవల ప్రైవేట్ భాగాల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో.. హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం చేయించానని, వైద్యులు పాప ప్రైవేట్ భాగాల్లో ఏదో చొప్పించినట్లు చెప్పారని తెలిపారు. ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ కు ఈ ఘటనపై కంప్లైంట్ చేశానని.. అయితే దీని వల్ల స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పారన్నారు.
డ్రైవర్ పై చర్యలు తీసుకుంటారని రెండ్రోజులు ఎదురుచూశానని, స్కూల్ కు తీసుకెళ్లేందుకు డ్రైవర్ మళ్లీ ఫోన్ చేసినపుడు అతడిని అడ్డుకోవడంతో తమను కులంపేరుతో దూషించాడని, కిడ్నాప్ చేస్తామని బెదిరించారని వాపోయారు. ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. కాగా.. ఇక్కడ డిజిటల్ అరెస్ట్ అంటే.. ఒక వ్యక్తి ప్రైవేట్ భాగాల్లోకి బలవంతంగా చేతి వేళ్లు, లేదా కాలివేళ్లను చొప్పించడం అని పోలీసులు తెలిపారు.






