- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూల్ వ్యాన్‌లో దారుణం.. నాలుగేళ్ల బాలికపై డ్రైవర్ రేప్
ఉత్తరప్రదేశ్ లక్నోలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికను స్కూల్ వ్యాన్‌లో అత్యాచారం చేశాడు డ్రైవర్ మొహమ్మద్ ఆరిఫ్. ఈ ఘటన జూలై 14న ఇందిరా నగర్ ప్రాంతంలో జరగ్గా.. బాధితురాలు తన తల్లికి సైగల ద్వారా ఈ దాడి గురించి తెలియజేసింది. ఆమె ప్రైవేట్ భాగాలలో నొప్పి,

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లక్నోలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికను స్కూల్ వ్యాన్‌లో అత్యాచారం చేశాడు డ్రైవర్ మొహమ్మద్ ఆరిఫ్. ఈ ఘటన జూలై 14న ఇందిరా నగర్ ప్రాంతంలో జరగ్గా.. బాధితురాలు తన తల్లికి సైగల ద్వారా ఈ దాడి గురించి తెలియజేసింది. ఆమె ప్రైవేట్ భాగాలలో నొప్పి, గాయాలను చూపించింది. ఈ విషయం వైద్య పరీక్షలో నిర్ధారణ కాగా.. తల్లి స్కూల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చింది. కానీ స్కూల్ ప్రతిష్టను కాపాడేందుకు చర్య తీసుకోకుండా.. ఆమెను మౌనంగా ఉండమని ఒత్తిడి చేశారు. ఆరిఫ్ కూడా తల్లిని బెదిరించి... ఆమె కూతురిని ఎత్తుకెళతానని హెచ్చరించాడు.
కానీ వెనక్కి తగ్గని తల్లి.. జూలై 17న ఇందిరా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆరిఫ్, స్కూల్ మేనేజర్ సందీప్ కుమార్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆరిఫ్‌ను అరెస్టు చేసి.. పోక్సో చట్టం, SC/ST (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు. వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఈస్ట్ జోన్ శశాంక్ సింగ్ నేతృత్వంలో జరుగుతున్న దర్యాప్తులో ఆరిఫ్ ఇతర పిల్లలపై కూడా అత్యాచారం చేసి ఉండవచ్చని అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరిఫ్‌ను పబ్లిక్‌గా ఉరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






