- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SC: మీ భావోద్వేగాలను దీనితో ముడిపెట్టొద్దు- గాంధీ మునిమనుమడికి సుప్రీంకోర్టు సూచన
మహాత్మా గాంధీ మునిమనుమడు(Mahatma Gandhi great grandson) తుషార్ గాంధీకి సుప్రీంకోర్టు(Supreme Court) కీలక సూచనలు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: మహాత్మా గాంధీ మునిమనుమడు(Mahatma Gandhi great grandson) తుషార్ గాంధీకి సుప్రీంకోర్టు(Supreme Court) కీలక సూచనలు చేసింది. సబర్మతి ఆశ్రమం(Sabarmati Ashram) ఆధునికీకరణకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా.. ఈ అంశంపై తుషార్ గాంధీ(Tushar Gandhi) ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, దీనిపైనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీ భావోద్వేగాలను ఈ అంశంతో ముడిపెట్టవద్దు. మనం ముందుకు వెళ్తున్నాం. ఈ దేశం అభివృద్ధికి దూసుకెళ్తోంది. ఇలాంటి అంశాలను ఇతర కోణాల్లో చూడాలి’’ అని కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాము అన్ని అంశాలను పరిశీలించామని, అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించింది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని (Sabarmati Ashram) రూ.1200కోట్లతో ఆధునికీకరించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిని 2022లో గుజరాత్ హైకోర్టు సమర్థించింది. అయితే తుషార్ గాంధీ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాజెక్టు ఆశ్రమం టోపోగ్రఫీ మారిపోతుందని.. నైతికత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.






