NEET-PG exam: ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహించాలి.. నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు ఆదేశాలు

by Shamantha N |

నీట్‌ పరీక్షా విధానంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. నీట్ పీజీ-25 (NEET-PG 2025) ప్రవేశ పరీక్షను ఒకే షిఫ్ట్ లో నిర్వహించాలంది.

NEET-PG exam: ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహించాలి.. నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్‌ పరీక్షా విధానంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. నీట్ పీజీ-25 (NEET-PG 2025) ప్రవేశ పరీక్షను ఒకే షిఫ్ట్ లో నిర్వహించాలంది. అభ్యర్థులందరికీ "న్యాయమైన, సహేతుకమైన, సమానమైన" పోటీకి నిర్వహించేందుకు ఒకే షిఫ్ట లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.ఈ మేరకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రవేశ పరీక్షను జూన్ 15న రెండు విడతల్లో నిర్వహించి, జులై 15న ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (NEB) ప్రకటించిన తర్వాత ఈ ఆదేశాలు వచ్చాయి. పరీక్షను రెండు విడతల్లో నిర్వహించడం వల్ల ప్రశ్నల క్లిష్టత స్థాయి మారి కొందరు విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని ఎన్‌ఈబీ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే దానిని ఒకేవిడతలో నిర్వహించేలా బోర్డ్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం సంబంధిత అధికారులకు ఈ ఆదేశాలు ఇచ్చింది. పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది. అయితే ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు, సమయం సరిపోదంటూ ఎన్‌ఈబీ వినిపించిన వాదనను సుప్రీం తోసిపుచ్చింది. అంతేకాకుండా, "ఏ రెండు ప్రశ్నపత్రాలు ఒకే స్థాయిలో డిఫికల్ట్ గా లేదా ఈజీగా ఉంటాయని ఎప్పుడూ చెప్పలేము" అని సుప్రీంకోర్టు పేర్కొంది. జూన్ 15న పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం ఉందని వ్యాఖ్యానించింది.

Next Story