- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karnataka HC: జైన్ వర్సిటీ స్టూడెంట్స్ పై ఆరోపణలు.. కేసు కొట్టివేసిన హైకోర్టు
కర్ణాటక రాజధాని బెంగళూరులోని జైన్ యూనివర్సిటీ స్టూడెంట్స్, ప్రొఫెసర్లపై నమోదైన కేసుని కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాజధాని బెంగళూరులోని జైన్ యూనివర్సిటీ స్టూడెంట్స్, ప్రొఫెసర్లపై నమోదైన కేసుని కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. బీఆర్ అంబేద్కర్ సహా దళితులను అవమానించేలా కాలేజ్ ఫెస్ట్ లో స్కిట్ ప్రదర్శించారని వారిపై కేసునమోదైంది. కాగా.. ఈ కేసులో విచారణ చేపట్టన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ స్కిట్ గురించి ప్రస్తావిస్తూ " భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం అందులో ఎలాంటి తప్పు కన్పించటత్లేదు. ఆ స్కిట్ వినోదరూపంలోనే ఉంది. వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తీకరమ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. ఎఫ్ఐఆర్ లో ఆరోపించిన నేరాల ప్రాథమిక అంశాలు సంతృప్తి పరచదు.” అని హైకోర్టు పేర్కొంది. అంతేకాకుండా, ఎఫ్ఐఆర్ ను ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి దాఖలు చేయలేదని గుర్తుచేసింది. ఏ ప్రదేశంలోనైనా అణగారిన వర్గాలను అవమానించే ఉద్దేశంతో ఉన్నారని సూచించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.
యూనివర్సిటీ ఫెస్ట్ లో వివాదం
ఫిబ్రవరి 2023లో బెంగళూరులోని జైన్ యూనివర్సిటీ యూత్ ఫెస్ట్ ని నిర్వహించింది. ఆ ఫెస్ట్ లో విద్యార్థులు అనేక కార్యక్రమాలను ప్రదర్శించారు. కాగా.. బీఆర్ అంబేద్కర్ కు సంబంధించిన స్కిట్ వివాదాస్పదంగా మారింది. దీంతో, ఆ స్కిట్ పై వివరణాత్మక నివేదిక కోరుతూ కోరుతూ కర్ణాటక ఉన్నత విద్యా శాఖ యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు, ఈ స్కిట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దినేష్ నీల్కాంత్ బోర్కర్ కోర్టుని ఆశ్రయించారు. అయితే, ఆ కేసుని కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.






