- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సావర్కర్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను విమర్శించిన సంజయ్ రౌత్
by Malleboina Mahesh |
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకులు ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకులు ఫైర్ అయ్యారు. ఈ రోజు ఉదయం ఉద్ధవ్ ఠాక్రే రాహుల్ ను హెచ్చరించగా.. అదే పార్టీకి చెందిన సంజయ్ రౌత్ రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. కాగా నిన్న రాహుల్ గాంధీ.. మీరు అడగ్గానే క్షమాపణ చెప్పడానికి నేను సావర్కర్ ని కాదు గాంధీని అని అన్నాడు. దీనిని వ్యతిరేకించిన రౌత్ "ఆయన గాంధీ, అయితే సావర్కర్ పేరును లాగాల్సిన అవసరం లేదు. సావర్కర్ మాకు స్ఫూర్తి" అని అన్నారు. అంతకుముందు రాహుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తాను ఎవరికీ క్షమాపణలు చెప్పనని, ఎందుకంటే తన పేరు సావర్కర్ కాదని, గాంధీ అన్న విషయం తెలిసిందే.
Next Story






