అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధర.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే

by Malleboina Mahesh |

రాష్ట్రంలోని అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో భాషా భేదం లేకుండా సినిమా టికెట్ ధరలు గరిష్టంగా రూ.200 (పన్నులు మినహాయించి)గా నిర్ణయిస్తూ కర్ణాటక ప్రభుత్వం కొత్త నియమాలు అమలు చేసింది.

అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధర.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే
X

దిశ, వెబ్‌డెస్క్: అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలపై కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్రంలోని అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో భాషా భేదం లేకుండా సినిమా టికెట్ ధరలు (MovieTicketPrice) గరిష్టంగా రూ.200 (పన్నులు మినహాయించి)గా నిర్ణయిస్తూ కొత్త నియమాలు అమలు చేసింది. రాష్ట్ర ప్రజలకు సమాన ధరకే సినిమా ప్రదర్శన అందించడమేనని తమ ఉద్దేశమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మొదటి నుంచి నిర్ణయంపై థియేటర్ యజమానులు, మల్టీప్లెక్స్ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

వారి వాదన ప్రకారం.. భారీ బడ్జెట్ సినిమాలు, ప్రీమియం స్క్రీన్లు, నిర్వహణ ఖర్చులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒకే రకమైన ధర పరిమితి (Price limit) విధించడం తమ వ్యాపారానికి ప్రతికూలమని, ఇలా చేస్తే సినిమా ఇండస్ట్రీ (FilmIndustry) దెబ్బతింటుందని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు (KarnatakaHighCourt)ను ఆశ్రయించిన మల్టీప్లెక్స్ యజమానులు తమ న్యాయమైన వాదనలను వినిపించారు. కాగా ప్రొడ్యూసర్లు, థియేటర్ యజమానుల వాదనలను పరిశీలించిన కర్ణాటక హైకోర్టు, ప్రభుత్వ ఆదేశాన్ని తాత్కాలికంగా నిలిపి వేసింది. అలాగే ఈ విషయంలో మరింత విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అనంతరం విచారణను వాయిదా వేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. దీంతో సినిమా టికెట్ల ధరల (Movie ticket prices)పై తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది.

Next Story