- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MVA: మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమికి షాక్.. ఎంవీఏని వీడిన సమాజ్ వాదీ పార్టీ
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీకి(MVA) షాక్ తగిలింది. ప్రతిపక్ష కూటమి నుంచి సమాజ్ వాదీ పార్టీ( Samajwadi Party ) వైదొలిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీకి(MVA) షాక్ తగిలింది. ప్రతిపక్ష కూటమి నుంచి సమాజ్ వాదీ పార్టీ( Samajwadi Party ) వైదొలిగింది. బాబ్రీ మసీదు కూల్చివేతపై ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందునే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. బాబ్రీ మసీదు కూల్చివేత(demolition of the Babri Masjid) 32వ వార్షికోత్సవం సందర్భంగా.. శివసేన (యూబీటీ) నాయకుడు మిలింద్ నార్వేకర్(Milind Narvekar) బాబ్రీ మసీదు ఫోటోను పోస్ట్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. "ఇది చేసిన వారిని చూసి నేను గర్వపడుతున్నాను" అని ఆ పోస్టుకు జత చేశారు. అంతేకాకుండా శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే ఫొటోలను కూడా పోస్టు చేశారు. దీనిపైన్ సమాజ్ వాదీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం..
మహారాష్ట్ర అసెంబ్లీలో(Maharashtra Assembly) సమాజ్‌వాదీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా.. ప్రతిపక్ష ఎంవీఏ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. ఆ కార్యక్రమాన్ని దాటవేశారు. కానీ, సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అబూ అసిమ్ అజ్మీ(Abu Asim Azmi), ఎస్పీ ఎమ్మెల్యే రైస్ షేక్(Rais Shaikh) ఎంవీఏ ఆదేశాలను ధిక్కరించి శాసనసభ్యులుగా ప్రమాణం చేశారు. "బాబ్రీ మసీదును కూల్చివేసిన వారిని అభినందిస్తూ శివసేన (యూబీటీ) వార్తాపత్రికలో ఒక ప్రకటన ఇచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే సహాయకుడు కూడా మసీదు కూల్చివేతను అభినందిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మేం ఎంవీఏ కూటమి నుంచి వైదొలగుతున్నాము. నేను అఖిలేష్ సింగ్ యాదవ్‌తో మాట్లాడుతున్నా. ఎంవీఏలోని వారు అలా ప్రవర్తిస్తే బీజేపీకి వారికి మధ్య తేడా ఏంటి? మేము వారితో ఎందుకు ఉండాలి?" అని అజ్మీ అన్నారు.






