- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకకు చెందిన వృక్షమాత మృతి చెందారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత సాలుమరద తిమ్మక్క (114) వృక్షమాతగా ప్రసిద్ధి చచెందారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధ అనారోగ్యంతో బెంగుళూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం కన్నుమూసినట్టు ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 1911 జూన్ 30న జన్మించిన తిమ్మక్క వృక్ష సంరక్షణకే తన జీవితం మొత్తం ధారపోశారు.
ఆమె నిస్వార్థ సేవలకుగాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు(Padmashri)తో సత్కరించింది. అలాగే ఇందిరా ప్రియదర్శిని, నాడోజా, వృక్షమాత తదితర అవార్డులతోపాటు, గౌరవ డాక్టరేట్‌ను కూడా తిమ్మక్క అందుకున్నారు. వృక్షమాత మృతిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తంచేశారు.
Next Story






