- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీతం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు.. అధికారుల సోదాల్లో షాకింగ్ విషయాలు
రూ.15 వేల జీతానికి పనిచేసే ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు రూ.30 కోట్లకు పైగా ఉండటం చూసి అధికారులు సైతం షాక్ అవుతున్నారు

దిశ, వెబ్ డెస్క్: రూ.15 వేల జీతానికి పనిచేసే ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు రూ.30 కోట్లకు పైగా ఉండటం చూసి అధికారులు సైతం షాక్ అవుతున్నారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. కలకప్ప నిడగుండి అనే వ్యక్తి కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (KRIDL)లో గత 20 సంవత్సరాలుగా ఔట్‌సోర్స్డ్ క్లర్క్‌గా విధులు నిర్వహించాడు. అతని నెల జీతం కేవలం రూ.15,000 మాత్రమే. అయితే, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడనే ఆరోపణలు రావటంతో నిడగుండి ఇంట్లో లోకాయుక్త సోదాలు చేపట్టింది.
ఈ దాడులు KRIDLలో రూ.72 కోట్ల నిధుల దుర్వినియోగానికి సంబంధించి జరుగుతున్న విచారణలో భాగంగా చేపట్టారు. ఈ క్రమంలో అధికారులు నిదగుండికి చెందిన భారీ స్థాయిలో అక్రమ ఆస్తులను గుర్తించారు. మొత్తం 24 ఇళ్లు, 6 స్థలాలు, 40 ఎకరాల వ్యవసాయ భూమి, 35 తులాల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి ఆభరణాలు, పలు వాహనాలు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిదగుండి, మరొక మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన జరణప్ప ఎం.చించోలికర్‌లు 2019 నుంచి 2025 మధ్య కాలంలో 96 నకిలీ ప్రాజెక్టులు రూపొందించారని అనుమానాలున్నాయి. వీటిలో డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీటి పనులు ఉన్నాయి. ఈ నకిలీ ప్రాజెక్టులలో భాగంగా పలు ప్రాంతాల్లో పనులు చూపిస్తూ రూ.72 కోట్ల ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వీరిపై KRIDL మేనేజింగ్ డైరెక్టర్ బసవరాజు ఆదేశాల మేరకు.. KRIDL ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అనిల్ పాటిల్ (కొప్పల్), ఆనంద్ కార్లకుంటి (నెలోగిపుర) ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగానే లోకాయుక్త అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా, కలకప్ప నిదగుండిని కొద్ది నెలల క్రితమే ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే చించోలికర్‌ను తొలగించినా, కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నాడు.






