- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Saif Ali khan: సైఫ్ అలీఖాన్ పై దాడి.. పోలీసుల అదుపులో అనుమానితుడు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali khan)పై దాడి కేసులో అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali khan)పై దాడి కేసులో అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మధ్యప్రదేశ్ నుంచి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడ్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మూడ్రోజుల క్రితం సైఫ్ అలీఖాన్ (Saif Ali khan)పై దుండగుడు దాడి చేశాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద అతడు చివరిసారి కనిపించాడని పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత అతడు వసాయి-విరార్ ప్రాంతాల వైపు లోక్‌ల్ ట్రైన్‌లో ప్రయాణం చేసినట్లు తేల్చారు. అతడు కబూతర్ ఖానా ప్రాంతంలోని ఒక మొబైల్ షాప్‌లో ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేస్తోన్న సీసీటీవీ ఫుటేజ్ లభ్యమయ్యింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడ్ని మధ్యప్రదేశ్ నుంచి అరెస్టు చేశారు.
కోలుకుంటున్న సైఫ్
ఇకపోతే, సైఫ్ ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు వెల్లడించారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. ఆయన నడవగలుగుతున్నారని, సాధారణ భోజనం తీసుకుంటున్నారని, మాట్లాడుతున్నారని చెప్పారు. ఇన్‌ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని వారాల పాటు విశ్రాంతి సూచించినట్లు శుక్రవారం మధ్యాహ్నం వైద్యులు తెలిపారు. మరోవైపు, సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్టేట్‌మెంట్‌ను బాంద్రా పోలీసులు రికార్డు చేసుకున్నారు. ఆమె దాడి గురించి పలు విషయాలు తెలియజేశారు. దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో కోపంగా ఉన్నాడని చెప్పారు. దాదాపు ఆరుసార్లు కత్తితో సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. అయితే అతడు ఇంట్లో వస్తువులు ఏవీ దొంగిలించలేదని చెప్పారు. ‘‘చిన్న కుమారుడు జేహ్, కేర్ టేకర్‌ను కాపాడే ప్రయత్నంలో సైఫ్ పోరాడారు. అప్పుడే అతడు సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడు. వెంటనే పిల్లలను పై ఫ్లోర్‌లోకి పంపించేశాం. దాడి తర్వాత ఎంతో కంగారుపడ్డా. ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ధైర్యం చెప్పడానికి మా సోదరి కరిష్మా వచ్చింది. తనతో నన్ను తీసుకెళ్లింది’’ అని కరీనా పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
Read More..
Kareena Kapoor: అతను ఎంతో ఆవేశంగా కత్తితో ఆరుసార్లు పొడిచాడు.. కరీనా కపూర్ ఎమోషనల్ కామెంట్స్






