- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Saif Ali Khan: బాలీవుడ్‌లో సంచలనం.. సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నం
బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో మరో సంచలనం చోటుచేసుకుంది. నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తెల్లవారుజామున 2.30 సమయంలో ఆయన ఇంట్లోకి చొరబడిన దొంగ సైఫ్‌పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో సైఫ్‌కు అలీఖాన్‌కు తీవ్ర గాయాలు కాగా.. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం లీలావతీ (Lilavati) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సర్జరీ కొనసాగుతోంది. మొత్తం సైఫ్ అలీఖాన్‌కు మెడ, వెన్నుముకతో పాటు ఆరు చోట్ల కత్తిపోట్లు పడినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడి చేసింది ఎవరనేది కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు.
కాగా, బాంద్రా (Bandra)లోని ఫార్చ్యూన్ హైట్స్ (Fortune Heights) 11వ ఫ్లోర్‌లో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఫ్యామిలీతో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున 2.30 సమయంలో ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించగా.. ఇంట్లోని పని మనుషులు మేల్కొని కేకలు పెట్టారు. దీంతో అప్రమత్తమై సైఫ్ దొంగను పట్టుకునేందుకు యత్నించగా.. దుండగుడు ఆయనపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడని ప్రాథమికంగా తెలుస్తోంది.






