- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నం.. రంగంలోకి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan Murder Case)పై జరిగిన హత్యాయత్నం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan Murder Case)పై జరిగిన హత్యాయత్నం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ అనూహ్య ఘటనతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో పాటు అంతా షాక్ అయ్యారు. తాజాగా.. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును ఛేదించే బాధ్యతను కీలక పోలీసు అధికారికి మహారాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. గురువారం సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ఇంటిని ముంబై క్రైమ్ బ్రాంచ్(Mumbai Crime Branch) అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్(Daya Naik) పరిశీలించారు. కాగా, దయా నాయక్ ఇప్పటివరకు 80 ఎన్‌కౌంటర్లు చేశారు. ఆయనపై పలు సినిమాలు కూడా వచ్చాయి.
మరోవైపు సైఫ్ అలీఖాన్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని లీలావతి ఆస్పత్రి(Lilavati Hospital) వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ఆయన వెన్నెముకకు తీవ్రగాయమైందని.. సర్జరీ చేసి వెన్నెముక నుంచి కత్తిని తొలగించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఆయన ఎడమ చేయితో పాటు మెడపైనా గాయాలయ్యాయి. అందుకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని లీలావతి ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటితో సహా దగ్గర్లోని అన్ని సీసీటీవీ దృశ్యాలను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పరిశీలిస్తున్నారు.
దయా నాయక్ ఎవరంటే..
కర్ణాటకలోని ఉడిపికి ప్రాంతానికి చెందిన దయా నాయక్.. 1995లో పోలీస్ ఉద్యోగం సాధించారు. దయా నాయక్ ఉద్యోగంలో చేరిన సమయంలో ముంబైలో అండర్‌వరల్డ్ పేరుతో విపరీతంగా దందాలు, హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలు జరిగాయి. ఈ క్రమంలోనే 1996లో చోటా రాజన్ గ్యాంగ్‌లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా నాయక్ పేరు మారుమోగింది. అక్కడినుంచి ఆయన ఏకంగా అండర్ వరల్డ్ నెట్‌వర్క్‌కు చెందిన దాదాపు 80 మందిని ఎన్‌కౌంటర్ చేసి.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా మారిపోయారు. ఆయన జీవిత కథ ఆధారంగా హిందీ, తెలుగు సహా అనేక భాషల్లో సినిమాలు కూడా వచ్చాయి.






