అవినీతి వాటాలో ఆయనదే పైచేయి.. రాజస్థాన్ పర్యటనలో అమిత్ షా సెటైర్లు

by Disha Web Desk 13 |
అవినీతి వాటాలో ఆయనదే పైచేయి.. రాజస్థాన్ పర్యటనలో అమిత్ షా సెటైర్లు
X

జైపూర్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభాన్ని లక్ష్యంగా చేసుకుని మాటల దాడికి దిగారు. కాంగ్రస్ అధిస్టానం ఎప్పుడూ సీఎం అశోక్ గెహ్లట్‌కు ప్రాధాన్యం ఇస్తుందని విరుచుకపడ్డారు. ఎందుకంటే అవినీతిలో గెహ్లట్‌దే పైచేయి అని సెటైర్లు వేశారు. రాజస్థాన్ సీఎంతో పోలిస్తే సచిన్ ఫైలెట్ వాటా తక్కువ ఉందని అందుకే ఆయనను పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. గెహ్లట్ రాజస్థాన్‌ను అవినీతికి అడ్డాగా మార్చారని విమర్శించారు.

రాష్ట్రాన్ని దోచుకుంటూ అవినీతి సొమ్మును పార్టీ ఖజానాకు చేర్చారని ఆరోపించారు. జైపూర్ బాంబు పేలుడు కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలతో సరైన ఆధారాలను సమర్పించలేదని అన్నారు. రాజస్థాన్‌లో 3డీ(దంగే, దుర్వ్యవహార్, దళితులపై దాడి) ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఓడిస్తారని అన్నారు. అసెంబ్లీ స్థానాల్లో మూడింట రెండో వంతుతో పాటు అన్ని లోక్‌సభ స్థానాలను బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.



Next Story